స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -109 లో... కనకం ఇంటికి నిశ్చితార్థంకి వచ్చినవారు కావ్యని పిలిచారా వస్తుందా అని అడుగుతారు. రావడం లేదు ఈ రోజు దుగ్గిరాల వారి ఇంట్లోనే ఫంక్షన్ ఉంది. రుద్రాణి కొడుకు రాహుల్ ది ఎంగేజ్ మెంట్ వాళ్లే ఫోన్ చేసి రమ్మన్నారు కానీ మేము రాలేమని చెప్పినట్టుగా కనకం అంటుంది. కనకం మాటలు అన్నీ స్వప్న వింటుంది. విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి రాహుల్ ఎంగేజ్ మెంటా? నన్ను మోసం చేసాడా? తల్లి మాట వినాలా? చెల్లి మాట వినాలా? రాహుల్ మాట నమ్మాలా? అని స్వప్న ఆలోచనలోపడుతుంది.
మరొకవైపు కావ్య, శృతిని రాహుల్ మనుషులు కిడ్నాప్ చేసి బంధిస్తారు. రౌడీలు చూడకుండా కావ్య తనతో తెచ్చుకున్న రాజ్ ఫోన్ నుండి అప్పుకి తమని కిడ్నాప్ చేసారని మెసేజ్ చేస్తుంది. అప్పు దగ్గరకి కావ్య ఇచ్చిన లెటర్ తీసుకొని కళ్యాణ్ వస్తాడు. అప్పుడే అప్పు కావ్య పంపిన మెసేజ్ చూసి.. మీ అన్న ఫోన్ నుండి మా అక్క మెసేజ్ చేసింది.. ఎవరో కిడ్నాప్ చేశారట వెళదామని అప్పు అంటుంది. మరి ఈ లెటర్ స్వప్నకి ఇవ్వమని కావ్య వదిన చెప్పిందని కళ్యాణ్ అంటాడు. అప్పు ఆ లెటర్ ని ఒక అబ్బాయికి ఇచ్చి స్వప్నకి ఇవ్వమని చెప్తుంది.
ఆ లెటర్ తీసుకుంటుంది స్వప్న. కావ్య రాహుల్ గురించి లెటర్ లో రాసింది చదివి స్వప్న ఆశ్చర్యపోతుంది. మరొకవైపు వెన్నెల, రాహుల్ ఎంగేజ్ మెంట్ జరుగుతుంది. అందరు కావ్య ఎక్కడ అని అడిగేసరికి నేనే బయటకు పంపించానని రాజ్ చెప్తాడు. రాజ్ బయటకు వచ్చి.. ప్రకాష్ ఫోన్ నుండి కావ్య దగ్గర ఉన్న తన ఫోన్ కి చేస్తాడు. ఆ ఫోన్ స్విచాఫ్ రావడం తో రాజ్ చిరాకుపడుతాడు. కావ్య, శృతి ని కిడ్నాప్ చేసిన దగ్గరికి అప్పు, కళ్యాణ్ లు వస్తారు. అప్పు రౌడీలను కొట్టి వాళ్ళని విడిపిస్తుంది. ఎవరు మిమ్మల్ని ఇలా చెయ్యమని చెప్పారని కావ్య రౌడీలను అడుగుతుంది. వాళ్ళు రాహుల్ చేయమన్నాడని చెప్తారు.
ఆ తర్వాత కావ్య, శృతిని తీసుకొని వేరే దగ్గరికి వెళ్తుంది. కళ్యాణ్ అప్పులతో స్వప్నని తీసుకొని పెళ్లి మండపంకి రమ్మని కావ్య చెప్పి వెళ్తుంది. మరొకవైపు మీడియా వాళ్ళతో అపర్ణ పరువుపోయేలా.. తన కోడలు గురించి ప్రశ్నలు వెయ్యండంటూ రుద్రాణి చెప్తుంది. మరొకవైపు కావ్య, శృతి ఇద్దరు ఒక హోటల్ కి వస్తారు. ఇందులోని మేనేజర్ కి రాహుల్ గురించి అంతా తెలుసని శృతి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.